Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

పెంచికల పేట లో శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణానికి విరాళం

Published

on

 

పెంచికల్పేట్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణానికి విరాళం

బిబిఎం ఏ పోలీస్ ఈ న్యూస్ /కమాన్పూర్, అక్టోబర్ 25 : కమాన్పూర్ మండలంలోని పెంచికల పేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, కాటమయ్య విగ్రహ దాతలుగా అనవేణ పద్మ శ్రీకాంత్, క్రీస్తు శేషులు సుధీర్, అనవేణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ₹25,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు దాతల దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబానికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షించారు. బిబిఎం ఏ పోలీస్ ఈ న్యూస్ /కమాన్పూర్, అక్టోబర్ 25 : కమాన్పూర్ మండలంలోని పెంచికల పేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, కాటమయ్య విగ్రహ దాతలుగా అనవేణ పద్మ శ్రీకాంత్, క్రీస్తు శేషులు సుధీర్, అనవేణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ₹25,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు దాతల దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబానికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షించారు.

 

బిబిఎం ఏ పోలీస్ ఈ న్యూస్ /కమాన్పూర్, అక్టోబర్ 25 : కమాన్పూర్ మండలంలోని పెంచికల పేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, కాటమయ్య విగ్రహ దాతలుగా అనవేణ పద్మ శ్రీకాంత్, సుధీర్, కీర్తి శేషులు అనవేణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ₹25,000 విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు దాతల దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబానికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

BBMA POLICE E:NEWS// మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ

Published

on

By

BBMA POLICE E:NEWS// మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ

BBMA POLICE E:NEWS// మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ

Mailardevpally Police Stationలో రాజేంద్రనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్. శ్రీనివాస్, IPS ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఫిర్యాదుదారులతో వ్యవహరిస్తున్న రిసెప్షనిస్ట్ ప్రవర్తనను సమీక్షించారు. డ్యూటీ రిజిస్టర్ల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

స్టేషన్‌కు వచ్చిన బాధితులతో డీసీపీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, కేసుల పురోగతిపై సమాచారం తెలుసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, పారదర్శకతతో పాటు వేగవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ, డీఐ మక్సూద్ అలీ, ఎస్ఐ పి. విశ్వనాథ్ రెడ్డి, ఏఎస్ఐ లాల్యా నాయక్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Police News

అరైవ్ అలైవ్ ప్రచారంలో గ్రామ సభ, రోడ్డు మరమ్మతులు, పొదల తొలగింపు

Published

on

అరైవ్ అలైవ్ ప్రచారంలో గ్రామ సభ, రోడ్డు మరమ్మతులు, పొదల తొలగింపు

బిబిఎంఏ న్యూస్ / కొరుట్ల, ఏప్రిల్ 13:

“అర్రైవ్ అలైవ్ ” రోడ్డు భద్రతా ప్రచారంలో భాగంగా కొరుట్ల పట్టణం, వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొరుట్ల ఎస్‌ఐ ఆధ్వర్యంలో, పాలక వర్గం, ఎంపీడీఓ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్ & బీ ఏఈ, ఎంవీఐ, పీసీ, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు సమన్వయంతో నిర్వహించారు.

గ్రామ సభలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామంలోని రహదారుల పరిస్థితిపై చర్చించారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో రోడ్లపై గుంతలను పూడ్చే ప్యాచ్ వర్క్ చేపట్టారు. అలాగే గ్రామ రహదారుల వెంట పెరిగిన పొదలను తొలగించి రోడ్డు మార్గాలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, రహదారి భద్రత కోసం గ్రామస్థులు చురుకుగా సహకరించడం అభినందనీయమన్నారు.

 

Continue Reading

Police News

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం  బాధ్యతతో డ్రైవింగ్ చేస్తేనే ప్రమాదాల నివారణ: డీసీపీ రామ్ రెడ్డి

Published

on

 

బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని, ఏప్రిల్ 13:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్‌లో “అరైవ్ లైవ్” కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్‌బెల్ట్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ వినియోగం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.

మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ యువతలో మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొన్నారు.

డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా ప్రమాదాలను తగ్గించడం సాధ్యం కాదని, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending