Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

బిబిఎంఏ న్యూస్అ //AP//TS/ క్రీడేషన్ పేరుతో జర్నలిస్టుల హక్కుల హరణను సహించం: ఎన్‌హెచ్‌ఆర్‌సి ఘాటైన హెచ్చరిక

Published

on

బిబిఎంఏ న్యూస్అ //AP//TS/ క్రీడేషన్ పేరుతో జర్నలిస్టుల హక్కుల హరణను సహించం: ఎన్‌హెచ్‌ఆర్‌సి ఘాటైన హెచ్చరిక

BBMA & BBMA POLICE E:NEWS // AP / TS //

అక్రీడేషన్ పేరుతో జర్నలిస్టుల స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆందోళన వ్యక్తం చేసింది. అక్రీడేషన్ ఉన్నప్పుడే జర్నలిస్టా అనే భావన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని సంస్థ స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛను కార్డుతో ముడిపెట్టడం ద్వారా జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.

సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు జర్నలిస్టులపై మానసిక ఒత్తిడిని పెంచేవిగా ఉన్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. అక్రీడేషన్ అనేది కేవలం పరిపాలనా సౌకర్యం కోసమే ఇచ్చే గుర్తింపు మాత్రమే తప్ప, జర్నలిస్టు హోదాకు అది ప్రమాణం కాదని వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అక్రీడేషన్ ఉన్నా లేకపోయినా వార్త రాయడం, మాట్లాడటం ప్రతి జర్నలిస్టుకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేసింది.

వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని నిషేధించడం జర్నలిస్టులను బహిరంగంగా అవమానించే చర్యగా భావించాల్సి వస్తుందని పేర్కొంది. ఇది పరోక్షంగా పత్రికా వృత్తిపై కుట్రపూరిత దాడిగా మారుతుందని హెచ్చరించింది. అవసరమైతే అక్రీడేషన్ దుర్వినియోగాన్ని అరికట్టే మార్గాలు వెతకాలి గానీ, మొత్తం జర్నలిస్టు సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచించింది.

ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి డిమాండ్ చేస్తూ, జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగే ఏ చర్యనైనా న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

Published

on

జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

మంథని, ఏప్రిల్ 05 (బీబీఎంఏ న్యూస్):

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మంథని పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. హక్కుల కోసం పోరాటం ద్వారానే సాధించుకోవాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

అయితే జయంతి రోజున మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని అలంకరించకపోవడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహానీయుడికి అవమానమని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ⚠️

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లింగయ్య, సుధాకర్, శ్రావణ్, రవికిరణ్ రిషి, ప్రణయ్ సమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి

Published

on

కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి చందర్

బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి

గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా గుండాల పాలన కొనసాగుతోందని విమర్శించారు.

ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు “డైవర్షన్ పాలిటిక్స్”లో భాగంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.

Continue Reading

News

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నిక

Published

on

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్ని

బిబిఎంఏ న్యూస్ /క్యాతనపల్లి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి (బిఅర్ఎస్) ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత (సిపిఐ ) ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు అధికారులు ధృవపత్రాలు అందజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాతనపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని నూతన ప్రజాప్రతినిధులు తెలిపారు.

Continue Reading

Trending