Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో చైతన్యం : గోదావరిఖనిలో అవగాహన సదస్సు, ర్యాలీ

Published

on

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో చైతన్యం : న్యాయసేవాధికార సంస్థ ట్రాఫిక్ పోలీస్ సంయుక్త అవగాహన సదస్సు, ర్యాలీ..

బిబిఎంఏ న్యూస్/గోదావరిఖని, జనవరి 08, 2026:

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా, రహదారి ప్రమాదరహిత సమాజం నిర్మాణం లక్ష్యంగా మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆవరణలో జరిగింది.

ఈ కార్యక్రమానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డా. టి. శ్రీనివాసరావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడిపితే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై విద్యార్థులకు స్పష్టత కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో చట్టపరమైన హక్కులు, బాధ్యతలపై న్యాయసేవాధికారులు అవగాహన ఇచ్చారు.

అనంతరం జడ్జి, పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం పెంపొందించడమే ఈ ర్యాలీ లక్ష్యమని తెలిపారు.

ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు అవగాహన కల్పించి రోడ్డు భద్రతకు రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు, సెషన్స్ న్యాయమూర్తి ఐ. సురత్ రాజ్ సింగ్, ప్రిన్సిపల్ జడ్జి ఎన్. వెంకట సచిన్ రెడ్డి, ద్వితీయ అదనపు న్యాయమూర్తి ధ్రువ వెంకటేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐలు హరిశేఖర్, రామరాజు, లాయర్లు, కోర్ట్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

Published

on

జయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

మంథని, ఏప్రిల్ 05 (బీబీఎంఏ న్యూస్):

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మంథని పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. హక్కుల కోసం పోరాటం ద్వారానే సాధించుకోవాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

అయితే జయంతి రోజున మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని అలంకరించకపోవడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహానీయుడికి అవమానమని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ⚠️

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లింగయ్య, సుధాకర్, శ్రావణ్, రవికిరణ్ రిషి, ప్రణయ్ సమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి

Published

on

కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి చందర్

బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి

గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా గుండాల పాలన కొనసాగుతోందని విమర్శించారు.

ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు “డైవర్షన్ పాలిటిక్స్”లో భాగంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.

Continue Reading

News

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నిక

Published

on

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్ని

బిబిఎంఏ న్యూస్ /క్యాతనపల్లి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి (బిఅర్ఎస్) ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత (సిపిఐ ) ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు అధికారులు ధృవపత్రాలు అందజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాతనపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని నూతన ప్రజాప్రతినిధులు తెలిపారు.

Continue Reading

Trending