Telangana
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం.. 27 వార్డులు కైవసం
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం 27 వార్డులు కైవసం
బిబిఎంఏ న్యూస్ / సిరిసిల్ల
సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 39 వార్డులకు గాను
భారత రాష్ట్ర సమితి 27 వార్డులను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది.
భారత జాతీయ కాంగ్రెస్ 6 వార్డులకు పరిమితం కాగా,
భారతీయ జనతా పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. ఒక్క స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే పట్టణమంతా గులాబీ శ్రేణుల సంబరాలతో మార్మోగింది.
ఈ విజయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే
కల్వకుంట్ల తారక రామారావు వ్యూహమే కీలకమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వార్డు వారీ సమీకరణాలు, అసంతృప్తుల నివారణ, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం, ప్రత్యర్థుల బలహీనతలపై స్పష్టమైన అంచనాలతో ముందుకు సాగడం గులాబీ పార్టీకి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ పలుమార్లు సిరిసిల్లలో పర్యటించి, ఇక్కడే ఉండి ప్రచారాన్ని నడిపిన తీరు ఫలితాలపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టణ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని తనవైపు తిప్పుకోవడంలో విఫలమైందన్న చర్చ కొనసాగుతోంది. వర్గ విభేదాలు, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్‌కు కలిసొచ్చాయని స్థానికంగా విశ్లేషిస్తున్నారు.
మొత్తంగా 27 వార్డుల ఆధిక్యంతో చైర్పర్సన్ పీఠం కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనుందని స్పష్టమవుతోంది. ఈ ఫలితాలతో “సిరిసిల్ల గడ్డ కేటీఆర్ అడ్డ” అన్న నినాదం మరోసారి నిజమైందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Police News
అరైవ్ అలైవ్ ప్రచారంలో గ్రామ సభ, రోడ్డు మరమ్మతులు, పొదల తొలగింపు
అరైవ్ అలైవ్ ప్రచారంలో గ్రామ సభ, రోడ్డు మరమ్మతులు, పొదల తొలగింపు
బిబిఎంఏ న్యూస్ / కొరుట్ల, ఏప్రిల్ 13:
“అర్రైవ్ అలైవ్ ” రోడ్డు భద్రతా ప్రచారంలో భాగంగా కొరుట్ల పట్టణం, వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొరుట్ల ఎస్‌ఐ ఆధ్వర్యంలో, పాలక వర్గం, ఎంపీడీఓ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్ & బీ ఏఈ, ఎంవీఐ, పీసీ, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు సమన్వయంతో నిర్వహించారు.
గ్రామ సభలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామంలోని రహదారుల పరిస్థితిపై చర్చించారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో రోడ్లపై గుంతలను పూడ్చే ప్యాచ్ వర్క్ చేపట్టారు. అలాగే గ్రామ రహదారుల వెంట పెరిగిన పొదలను తొలగించి రోడ్డు మార్గాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, రహదారి భద్రత కోసం గ్రామస్థులు చురుకుగా సహకరించడం అభినందనీయమన్నారు.
Police News
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం బాధ్యతతో డ్రైవింగ్ చేస్తేనే ప్రమాదాల నివారణ: డీసీపీ రామ్ రెడ్డి
బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని, ఏప్రిల్ 13:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్‌లో “అరైవ్ లైవ్” కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్‌బెల్ట్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ వినియోగం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.
మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ యువతలో మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొన్నారు.
డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా ప్రమాదాలను తగ్గించడం సాధ్యం కాదని, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Police News
బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దుర్గామాత ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు
బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దుర్గామాత ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు
బెల్లంపల్లి, ఏప్రిల్ 12 (బిబిఎంఏ న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దుర్గామాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాంతి భద్రతలు నెలకొనాలని డీజీపీ ప్రార్థించారు. అనంతరం 1998లో బెల్లంపల్లి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దుర్గాదేవి ఆలయం, మసీదు, చర్చ్ నిర్మాణాల కోసం చేపట్టిన కార్యక్రమాలను స్మరించుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను అధికారులు ఫోటోల రూపంలో చూపించగా డీజీపీ భావోద్వేగానికి లోనయ్యారు. బెల్లంపల్లి ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సిబ్బందితో ఆనందాన్ని పంచుకున్నారు.
-
News2 weeks agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Telangana4 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Police News7 days ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
Telangana4 weeks agoమంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
-
Police News2 weeks agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
Telangana4 weeks agoఘనంగా రిమ్ జిమ్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం
-
Telangana4 weeks agoఉప్పల్‌లో హత్య కేసు ఛేదన… 6 గంటల్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
-
india3 weeks agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
