Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

రామగుండం 11వ డివిజన్లో కారంగుల రమ్య ఘనవిజనం

Published

on

బిబిఎంఏ న్యూస్ / రామగుండం
రామగుండం మున్సిపాలిటీ 11వ డివిజన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థి కరెంగుల రమ్య ఘన విజయం సాధించారు. ఆమెకు 1,425 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దెల్లి తేజస్వినికి 676 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 749 ఓట్ల మెజారిటీతో కరెంగుల రమ్య విజయం సాధించడంతో డివిజన్‌లో కార్యకర్తలు, స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

అరైవ్ అలైవ్ ప్రచారంలో గ్రామ సభ, రోడ్డు మరమ్మతులు, పొదల తొలగింపు

Published

on

అరైవ్ అలైవ్ ప్రచారంలో గ్రామ సభ, రోడ్డు మరమ్మతులు, పొదల తొలగింపు

బిబిఎంఏ న్యూస్ / కొరుట్ల, ఏప్రిల్ 13:

“అర్రైవ్ అలైవ్ ” రోడ్డు భద్రతా ప్రచారంలో భాగంగా కొరుట్ల పట్టణం, వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొరుట్ల ఎస్‌ఐ ఆధ్వర్యంలో, పాలక వర్గం, ఎంపీడీఓ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్ & బీ ఏఈ, ఎంవీఐ, పీసీ, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు సమన్వయంతో నిర్వహించారు.

గ్రామ సభలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామంలోని రహదారుల పరిస్థితిపై చర్చించారు. అనంతరం గ్రామస్థుల సహకారంతో రోడ్లపై గుంతలను పూడ్చే ప్యాచ్ వర్క్ చేపట్టారు. అలాగే గ్రామ రహదారుల వెంట పెరిగిన పొదలను తొలగించి రోడ్డు మార్గాలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, రహదారి భద్రత కోసం గ్రామస్థులు చురుకుగా సహకరించడం అభినందనీయమన్నారు.

 

Continue Reading

Police News

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం  బాధ్యతతో డ్రైవింగ్ చేస్తేనే ప్రమాదాల నివారణ: డీసీపీ రామ్ రెడ్డి

Published

on

 

బిబిఎంఏ న్యూస్ /గోదావరిఖని, ఏప్రిల్ 13:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్‌లో “అరైవ్ లైవ్” కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్‌బెల్ట్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ వినియోగం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.

మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ యువతలో మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొన్నారు.

డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా ప్రమాదాలను తగ్గించడం సాధ్యం కాదని, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Police News

బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దుర్గామాత ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Published

on

బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దుర్గామాత ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

బెల్లంపల్లి, ఏప్రిల్ 12 (బిబిఎంఏ న్యూస్): రామగుండం పోలీస్ కమిషనరేట్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దుర్గామాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాంతి భద్రతలు నెలకొనాలని డీజీపీ ప్రార్థించారు. అనంతరం 1998లో బెల్లంపల్లి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దుర్గాదేవి ఆలయం, మసీదు, చర్చ్ నిర్మాణాల కోసం చేపట్టిన కార్యక్రమాలను స్మరించుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను అధికారులు ఫోటోల రూపంలో చూపించగా డీజీపీ భావోద్వేగానికి లోనయ్యారు. బెల్లంపల్లి ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సిబ్బందితో ఆనందాన్ని పంచుకున్నారు.

Continue Reading

Trending